News April 11, 2024
జగన్ సంస్కరణలతో పేదరికం తగ్గింది: బొత్స
AP: సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలతో ఏపీలో పేదరికం తగ్గిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ చెప్పిందే చేశారన్నారు. ఆర్థిక కారణాలతో సీపీఎస్ అమలు చేయలేకపోయామని తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News November 16, 2024
పేదలకు 3 సెంట్లలో ఇళ్లు నిర్మిస్తాం: చంద్రబాబు
AP: ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లలో ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏడాదిలో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా ప్లాన్ చేశామని చెప్పారు. ‘రాత్రికి రాత్రే అన్ని పనులు చేస్తామని మేం చెప్పడం లేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విధ్వంసం జరిగింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుదలతో కృషి చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News November 16, 2024
కులగణన సకాలంలో పూర్తి చేయండి: రేవంత్
TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.
News November 15, 2024
ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా రవిబాబు
AP: ఒంగోలు నియోజకవర్గ YCP ఇన్ఛార్జిగా చుండూరి రవిబాబును ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం), బొడ్డేడ ప్రసాద్ (అనకాపల్లి)లను నియమించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించింది. ఆముదాలవలస YCP సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.