News November 9, 2025
GWL: టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే..!

తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లు అమర్చేందుకు డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు ఈ ఏడాది రబీ లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ విషయమై ఇటీవల కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే గతేడాది డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోగా స్టాప్ లాక్ గేట్ అమర్చారు. ఇంజినీరింగ్ నిపుణుల ఆదేశం మేరకు 33 కొత్త గేట్లు అమర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News November 9, 2025
వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.
News November 9, 2025
జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్‌తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.
News November 9, 2025
RGM: కూల్చివేసిన ఆలయాల వద్ద పూజలు

రామగుండం కార్పొరేషన్‌లోని వివిధ ప్రాంతాలలో ఇటీవల అధికారులు కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలను BJP శ్రేణులు ఆదివారం శుద్ధి చేసి, పూజలు చేశారు. BJP రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య- అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని అమ్మవార్లకు దీపా, దూప, నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. కూల్చివేసిన ఆలయాలను కార్పొరేషన్ అధికారులు వెంటనే పునర్నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.


