News November 9, 2025

NLG: అమ్మాయిలతో ఇలా రీల్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SMలో పిచ్చి పిచ్చి రీల్స్ చేసేవారిపై HYD పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యువతితో రొమాన్స్ చేస్తూ నల్గొండకు చెందిన మైనర్ ఆటో నడిపిన ఘటనపై చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యకరమైన చేష్టలతో రీల్స్ చేసి SMలో అప్‌లోడ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్‌లో పరువు పోయేలా వికృత రీల్స్ చేసి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కించకండి.

Similar News

News November 9, 2025

వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

image

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.

News November 9, 2025

జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్‌తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.

News November 9, 2025

RGM: కూల్చివేసిన ఆలయాల వద్ద పూజలు

image

రామగుండం కార్పొరేషన్‌లోని వివిధ ప్రాంతాలలో ఇటీవల అధికారులు కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలను BJP శ్రేణులు ఆదివారం శుద్ధి చేసి, పూజలు చేశారు. BJP రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య- అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని అమ్మవార్లకు దీపా, దూప, నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. కూల్చివేసిన ఆలయాలను కార్పొరేషన్ అధికారులు వెంటనే పునర్నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.