News November 9, 2025

KMR: రేపు విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి

image

కామారెడ్డిలో విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్‌వో, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 9, 2025

ట్యాంక్‌బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

image

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.

News November 9, 2025

వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు: అదనపు కలెక్టర్

image

హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాలో 24 కంపెనీలు పాల్గొనగా 682 మంది యువతీ యువకులు నమోదు చేసుకున్నారు. వీరిలో 214 మందికి ఉద్యోగాలు దక్కాయి. వృత్తి విద్యతో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉపాధి పొందాలని అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి సూచించారు.

News November 9, 2025

ఇతిహాసాలు – 61 సమాధానం

image

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
జవాబు: కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులు మరణించడంతో ఆ బాధ, కోపంతో శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమవ్వాలని గాంధారీ శపించింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆయన పాండవుల విజయానికి పరోక్షంగా కారణమయ్యాడని నిందిస్తూ.. యాదవ వంశం కలహాలతో నశించిపోతుందని, కృష్ణుడు ఒంటరిగా చనిపోతాడని శపించింది. <<-se>>#Ithihasaluquiz<<>>