News November 9, 2025
చంద్రయాన్-3 బడ్జెట్ దాటేసిన స్క్రాప్ ఆదాయం

స్క్రాప్ అమ్మకం ద్వారా గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం దాదాపుగా రూ.800 కోట్లు. ఇది చంద్రయాన్-3 కోసం మన దేశం చేసిన ఖర్చు (రూ.615 కోట్లు) కంటే ఎక్కువ. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రధాని మోదీ సర్కార్ ప్రారంభించింది. పరిశుభ్రత టార్గెట్‌గా ప్రారంభించిన ఈ డ్రైవ్ కేంద్రానికి భారీ ఆదాయాన్ని అందిస్తోంది. 2021 నుంచి ఇప్పటివరకు రూ.4,100 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టింది.
Similar News
News November 9, 2025
సంక్రాంతికి రవితేజ సినిమా.. రేపే ఫస్ట్ లుక్

రవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఆశికా రంగనాథ్ హీరోయిన్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజకు ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందేమో చూడాలి.
News November 9, 2025
ALERT.. వచ్చే 8 రోజులు జాగ్రత్త!

TG: ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ADB, కొమురం భీమ్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.
News November 9, 2025
ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్‌లకు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.


