News November 9, 2025
HYD: KTRను చెత్తకుండికి కట్టేయండి: CM రేవంత్

జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ‘చెత్త’ చుట్టూ రాజకీయం ఆగడం లేదు. తాజాగా CM రేవంత్ KTRకు కౌంటర్ వేశారు. ‘ఆడ చెత్త ఉంది.. ఈడ చెత్త ఉంది అంటున్నారు. 3 సార్లు BRS MLA ఉండు. మున్సిపల్ మిన్సిస్టర్ KTR, MPగా కిషన్ రెడ్డి ఉండు. ఇన్నేళ్లు ఏం చేశారు? తోడు దొంగలు మీరే. మా ప్రాతినిథ్యం లేని చోట జవాబు చెప్పమనడం ఏంటి?. చెత్తకుండిని చూసి KTRను అక్కడ కట్టేయండి. ఆయనకు తత్వం అయినా బోధపడుతది’ అంటూ CM వ్యాఖ్యానించారు.
Similar News
News November 9, 2025
ట్యాంక్‌బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్‌లో అంతా గప్‌చుప్..!

దాదాపు నెలరోజులుగా స్పీకర్ సౌండ్‌లు, ఓటర్లతో మీటింగ్‌లు, హామీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హోరెత్తింది. ఇవాళ ముగింపు ప్రచారంలో 3 ప్రధాన పార్టీల నేతలు చెలరేగిపోయారు. కాగా ఎలక్షన్‌కు 48గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధనతో అంతా గప్‌చుప్ అయింది. ఇక గప్‌చుప్‌గా లోకల్ నేతల హవా నడువనుంది. నోట్ల పంపిణీ, ఓటర్లను మచ్చిక చేసుకోవడం అంతా వీరి చేతుల్లోనే ఉంటుందిక. మళ్లీ సంబరాలు రిజల్ట్స్ డే రోజే ఇక.
News November 9, 2025
గచ్చిబౌలి: ముగిసిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్, కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


