News November 9, 2025
HNK: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సర్వం సిద్ధం

హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ర్యాలీ సజావుగా జరిగేందుకు హన్మకొండ ఏసీపీ నర్సింహ రావు, ఇన్‌స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడం పాటు.. పరిసరాలపై నిఘా పెట్టారు.
Similar News
News November 9, 2025
కమీషన్ల కోసమే మేడారంలో కాలయాపన: నాగజ్యోతి

మేడారం జాతరకు మరో 70 రోజులే గడువు ఉన్నప్పటికీ పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. కమీషన్ల కోసమే అధికారులు పనుల్లో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పచ్చని మేడారాన్ని ఎడారిలా మార్చేశారని, షాపులు కోల్పోయిన వ్యాపారులకు తక్షణమే ప్రత్యామ్నాయం చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.
News November 9, 2025
తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 9, 2025
2024 జులై నుంచి ఉన్నవారి జోలికి హైడ్రా వెళ్లదు

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.


