News November 9, 2025

నిట్ వరంగల్‌లో ఉచిత GATE శిక్షణకు దరఖాస్తులు

image

వరంగల్ నిట్‌లో ఉచిత GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులు శిక్షణలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కోచింగ్ అన్ని ఇంజినీరింగ్ విభాగాలను కవర్ చేస్తూ 17 నవంబర్ 2025 నుంచి 9 జనవరి 2026 వరకు 8 వారాల పాటు కొనసాగుతుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News November 9, 2025

రూ.318 కోట్లతో ఫుడ్ పార్కులు.. 11న సీఎం శంకుస్థాపన

image

ఏలూరు జిల్లాలో ఏర్పాటు కానున్న రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు నవంబర్ 11న వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ద్వారకాతిరుమలలో రూ.208 కోట్లతో గోద్రెజ్ ఆగ్రోవెట్, నూజివీడులో రూ.110 కోట్లతో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,866 మందికి ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.

News November 9, 2025

భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

image

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్‌లో భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.

News November 9, 2025

HYD: వారి జోలికి హైడ్రా వెళ్లదు: రంగనాథ్

image

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.