News April 11, 2024
నెల్లూరు: మద్యం దుకాణాలపై ఆంక్షలు..?

ఆంక్షలతో నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 271 షాపులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో.. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News October 6, 2025
నెల్లూరు: PGRS స్థితి తెలుసుకునేందుకు కాల్ సెంటర్

PGRS అర్జీల స్థితి తెలుసుకొనేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని అన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
News October 5, 2025
జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతు

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా.. కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News October 5, 2025
నెల్లూరు: బానిసత్వం నుంచి విముక్తి

నెల్లూరు(D) కాకుటూరుకు చెందిన ముగ్గురు మైనర్లకు విముక్తి లభించింది. వీళ్లను బానిసలుగా చేసుకుని పని చేయించుకుంటున్నారు. ఈక్రమంలో జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు దాడులు చేసి వారికి విముక్తి కల్పించారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆ విభాగం ఏఎస్ఐ శ్రీహరి బాబు, పోలీస్ సిబ్బంది రాంబాబు చెప్పారు. ఈ ముగ్గురిని విశ్వ జననీ చైల్డ్ హోం కేర్లో చేర్చారు.