News November 9, 2025
జూబ్లీహిల్స్ పోటీలో నలుగురు మహిళా అభ్యర్థులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు సోషలిస్ట్ పార్టీ నుంచి సుభద్రారెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇంక్విలాబ్-ఏ-మిల్లత్ నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. నలుగురు అభ్యర్థుల్లో అస్మాబేగం పిన్న వయస్కురాలు.
Similar News
News November 9, 2025
ASF: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

ఈనెల 10 నుంచి 15 వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ కోరారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన, డ్రంక్ & డ్రైవ్, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు.
News November 9, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 9, 2025
అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.


