News November 9, 2025

RITES 40పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<>RITES<<>>)40 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PWBDలు రూ.300 చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

Similar News

News November 10, 2025

సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

image

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండ‌రీ ఆసుప‌త్రులుండ‌గా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుప‌త్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్ద‌రు చొప్పున, మ‌రో 13 ఏరియా ఆసుప‌త్రుల‌కు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుప‌త్రుల‌కు ఇద్ద‌రు చొప్పున స్పెష‌లిస్టుల‌ను నియ‌మించారు. మ‌రో 97 ఆసుప‌త్రుల‌కు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.

News November 10, 2025

అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

image

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.

News November 10, 2025

కూతురి విజయం.. తండ్రికి మళ్లీ పోలీస్ జాబ్!

image

ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ సభ్యురాలైన క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 2012లో ఎన్నికల విధుల్లో పొరపాటు వల్ల పోలీస్ ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నాసింగ్‌కు తిరిగి కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని తెలిపింది. తన తండ్రిని మళ్లీ యూనిఫామ్‌లో చూడటం, ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కల అని క్రాంతి పేర్కొన్నారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా ఉండేది కాదన్నారు.