News November 9, 2025
కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలిగా పద్మావతి

విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన పద్మావతి నియమితులయ్యారు. ఆదివారం పత్తికొండ పట్టణంలో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఇందులో విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పద్మావతిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తనను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 9, 2025
కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలులోని నిర్మల్ నగర్‌లో ఆదివారం విషాదం నెలకొంది. కాలనీకి చెందిన భరత్ కుమార్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే సెమిస్టర్ పరీక్షలు రానున్నాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
News November 9, 2025
ఈనెల 11న సీఎం వర్చువల్ శంకుస్థాపనలు: కలెక్టర్

జిల్లాలో పలు ప్రాజెక్టులకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్డీవోలు, ఏపీఐఐసీ, ఎయిర్‌పోర్ట్, టూరిజం అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులు, స్టేక్‌హోల్డర్లతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేలా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News November 9, 2025
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరు పెట్టి వచ్చే యాడ్స్, వాట్సాప్/ ఇన్‌స్టాగ్రామ్/ టెలిగ్రామ్ లింక్స్‌ను నమ్మవద్దు అన్నారు. తక్కువలో ఎక్కువ లాభాలు వచ్చే వాగ్దానాలు కచ్చితంగా మోసం చేసేందుకే అన్నారు. లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత APK/ఫైళ్ళు ఇన్‌స్టాల్ చేయవద్దని, OTP, UPI PIN వంటివి చెప్పొద్దన్నారు.


