News April 11, 2024

NLG: మిగిలింది నాలుగు రోజులే

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. నలగొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నూతన ఓటు నమోదు, జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు విధించింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 4రోజుల సమయం ఉంది. ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.

Similar News

News March 5, 2026

నల్గొండ: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

image

NLG జిల్లాలోని 5,38,650 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, రాబోయే CMR సేకరణకు స్థలం కేటాయించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,051 రేషన్ షాపులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 4, 2026

NLG: మహిళలు కనిపిస్తే చాలు.. దూసుకెళ్తున్న బస్సులు!

image

జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాక కోసం పల్లె ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకైతే బస్సు సౌకర్యమే లేదు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో స్టాప్‌లలో మహిళలు ఎక్కువగా ఉంటే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News March 4, 2026

నల్గొండ: కళాకారులకు వరం.. పీఎం విశ్వకర్మ మేళా!

image

చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి 8 వరకు ఎస్బీఆర్ (SBR) ఫంక్షన్ హాల్‌లో ‘పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్’ నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ (MSME) ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ప్రదర్శనలో లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.