News April 11, 2024
కుప్పం మీదుగా స్పెషల్ రైలు

గోరఖ్‌పూర్ స్పెషల్ రైలును రేపటి నుంచి కుప్పం మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కుప్పం మీదుగా కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో సోమవారం సాయంత్రం 5.40గంటలకు కుప్పం మీదుగా బెంగళూరు కృష్ణరాజపురానికి వెళ్తుంది. 6 వారాలు మాత్రమే ఈ స్పెషల్ రైలు నడవనుంది.
Similar News
News March 1, 2026
చిత్తూరు జిల్లాలో 93% పింఛన్ల పంపిణీ

జిల్లాలో శనివారం 93.10 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,33,419 మందికి గాను తొలి రోజున 2,17,324 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు అందజేశామన్నారు. మార్చి ఒకటిన ఆదివారం సెలవు కావడం తో, 2న సోమవారం మిగిలిన 16,095 మందికి పింఛన్లు అందించనున్నట్లు పీడీ పేర్కొన్నారు.
News March 1, 2026
చిత్తూరు: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,528 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. మార్చి 13 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.
News February 28, 2026
పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

గుడిపాల మండలంలో ఇప్పటి వరకు 89.76% శాతం మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శిరీష తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం 197. రామాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 89.76% పెన్షన్లు పూర్తి చేశామన్నారు. మండలంలో 6,730 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. పెన్షన్ లబ్ధిదారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.


