News November 9, 2025
నాగర్‌కర్నూల్: బస్సు ఆపలేదని శ్రీశైలం రహదారిపై మహిళల ధర్నా

నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ చౌరస్తాలో శ్రీశైలం జాతీయ రహదారిపై మహిళలు ధర్నా చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లేందుకు గంటల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బస్సును అడ్డగించారు. ఈ సంఘటనతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి జోక్యంతో సమస్య సద్దుమణిగింది, అనంతరం మహిళలు తమ ప్రయాణం కొనసాగించారు.
Similar News
News November 10, 2025
ఏపీ టుడే

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.
News November 10, 2025
వరంగల్ ప్రజలు ఈ వారం జాగ్రత్త

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి వారం రోజులపాటు చలి పంజా విసరనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 11 నుండి 19 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో 11 నుంచి14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు, మహబూబాబాద్ జిల్లాలో 14 నుంచి 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
News November 10, 2025
ప్రేమకు చిహ్నం: కుమారుడికి గుడి కట్టించి.. పూజలు

భద్రాద్రి కొత్తగూడెం(D) పాల్వంచ(M) కొత్త సూరారం గ్రామంలో కన్న కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, అతని జ్ఞాపకార్థం గుడి కట్టించారు. గ్రామానికి చెందిన జక్కుల శేఖర్-నాగలక్ష్మి దంపతుల కుమారుడు సంపత్ కుమార్ గత ఏడాది కిన్నెరసాని వాగులో ప్రమాదవశాత్తు మరణించాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు సంపత్ కుమార్ విగ్రహాన్ని తయారు చేయించి, నిత్యం పూజలు చేస్తూ తమ ప్రేమను చూపుతున్నారు.


