News November 10, 2025
సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండరీ ఆసుపత్రులుండగా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుపత్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్దరు చొప్పున, మరో 13 ఏరియా ఆసుపత్రులకు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుపత్రులకు ఇద్దరు చొప్పున స్పెషలిస్టులను నియమించారు. మరో 97 ఆసుపత్రులకు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.
Similar News
News March 25, 2026
రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.
News March 25, 2026
రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
News March 25, 2026
ఈసారి సిక్సర్ల వీరుడు ఎవరో?

ఈసారి IPLలో సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. ముఖ్యంగా SRHలోని హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్ విరుచుకుపడతారని తెలిపారు. వారితో పాటు శాంసన్ (CSK), అలెన్ (KKR), పూరన్ (LSG), రోహిత్ శర్మ (MI), శివమ్ దూబే (CSK), వైభవ్ సూర్యవంశీ (RR), బ్రెవిస్ (CSK) ఈ రేసులో ముందున్నారు. మరి ఈ సీజన్లో ఎవరు అత్యధిక సిక్సర్లు కొడతారో కామెంట్ చేయండి.


