News November 10, 2025

ఏలూరు: నేడు పీజీఆర్ఎస్‌కు కలెక్టర్ దూరం

image

ఏలూరు ప్రాంగణం గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పాల్గొనరని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆదివారం తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో, ఆ బృందం వెంట కలెక్టర్, జేసీ ఉంటారని ఆయన వివరించారు.

Similar News

News November 10, 2025

ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.

News November 10, 2025

రాజన్న ఆలయం వద్ద అదనపు బందోబస్తు

image

వేములవాడ రాజన్న ఆలయం వద్ద పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం లోపలికి వెళ్ళేందుకు ప్రధాన ద్వారం మెట్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం నాడు చోటు చేసుకున్న తోపులాట దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఎస్ఐలు ఎల్లాగౌడ్, రాజు, ఆలయ ఎస్పీఎఫ్ ఏఎస్ఐ మహేందర్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

News November 10, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.