News November 10, 2025
మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచిన ప్రభుత్వం

AP: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, యూజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచింది. 2020-23 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10%, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15% పెంపునకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తుదితీర్పులకు లోబడి ఇది ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.17.25 లక్షలుగా ఫీజును నిర్ధారించింది.
Similar News
News November 10, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.
News November 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 10, 2025
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


