News November 10, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. రూ.వందల కోట్ల ఖర్చు!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీలు రూ.వందల కోట్లు కుమ్మరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు రూ.1500-2500 వరకు ఇస్తున్నాయని టాక్. ఇక్కడ మొత్తం 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. అందులో కనీసం 3 లక్షల మందికి రూ.2500 చొప్పున పంపిణీ చేసినా రూ.75Cr ఖర్చవుతుంది. ఇక ప్రచారానికి జన సమీకరణ, యాడ్స్‌కు అదనం. దీంతో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రేపు పోలింగ్ జరగనుంది.

Similar News

News November 10, 2025

డాక్టర్ ఇచ్చిన టిప్.. 360 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

image

భారీ ఉగ్ర కుట్రను జమ్మూకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో 360 కిలోల ఆర్డీఎక్స్, AK-47 రైఫిల్, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్‌(కశ్మీర్‌)లో అరెస్టయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అల్ ఫలా ఆస్పత్రిలో తనిఖీలు చేసి వీటిని కనుగొన్నారు. ఈ కేసులో మరో డాక్టర్ ముజామిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

News November 10, 2025

గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్‌లో అమ్మింది 40 కార్లే

image

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్‌లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.

News November 10, 2025

కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

image

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.