News November 10, 2025

నిజామాబాద్ రైతన్న.. యాసంగికి రెడీ..!

image

ఉమ్మడి NZB జిల్లాలో యాసంగి పంటల సాగుపై రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడటంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సంమృద్ధిగా నీరు వచ్చి చేరింది. శనగ, వరి మెుక్కజొన్న పంటలు ఎక్కువ మెుత్తంలో సాగయ్యే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పొచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టుల ద్వారా విడతల వారీగా నీటిని అందించనున్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉంది.

Similar News

News November 10, 2025

జూబ్లీహిల్స్‌ను ‘వదలని’ Non-Locals!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ‘స్థానికేతరులు’ (non-locals) హోటళ్లు, ప్రైవేట్ ఇళ్లలో మకాం వేశారని సమాచారం. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీరు పోలింగ్‌కు ముందు నియోజకవర్గం విడిచివెళ్లాలి. అయితే, వీరిని గుర్తించి పంపించడం అధికారులకు సవాల్‌గా మారింది.

News November 10, 2025

డాక్టర్ ఇచ్చిన టిప్.. 360 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

image

భారీ ఉగ్ర కుట్రను జమ్మూకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో 360 కిలోల ఆర్డీఎక్స్, AK-47 రైఫిల్, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్‌(కశ్మీర్‌)లో అరెస్టయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అల్ ఫలా ఆస్పత్రిలో తనిఖీలు చేసి వీటిని కనుగొన్నారు. ఈ కేసులో మరో డాక్టర్ ముజామిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

News November 10, 2025

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ జాబ్స్‌కి నోటిఫికేషన్ విడుదల

image

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 09. లైబ్రేరియన్ – 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1, ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1, లాబొరేటరీ అసిస్టెంట్ (విద్య) -1, లాబొరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ & టెక్నాలజీల్యాబ్) -1, అప్పర్ డివిజన్ క్లర్క్ -1, లైబ్రరీ అటెండెంట్ -2, గ్రూప్ C -1. ఈనెల 30 లాస్ట్‌ డేట్. వివరాలకు https://nsktu.ac.in/ ని సంప్రదించండి.