News November 10, 2025

చక్కెర తినడం మానేస్తే..

image

చక్కెర తినడం మానేస్తే శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. సాధారణంగా బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె, కాలేయం మరింత ఆరోగ్యవంతంగా మారుతాయి. చిరాకు, ఆందోళన తగ్గి ఫోకస్ పెరుగుతుంది. అయితే ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించాలి’ అని సూచిస్తున్నారు.

Similar News

News November 10, 2025

డాక్టర్ ఇచ్చిన టిప్.. 360 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

image

భారీ ఉగ్ర కుట్రను జమ్మూకశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో 360 కిలోల ఆర్డీఎక్స్, AK-47 రైఫిల్, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్‌(కశ్మీర్‌)లో అరెస్టయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అల్ ఫలా ఆస్పత్రిలో తనిఖీలు చేసి వీటిని కనుగొన్నారు. ఈ కేసులో మరో డాక్టర్ ముజామిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

News November 10, 2025

గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్‌లో అమ్మింది 40 కార్లే

image

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్‌లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.

News November 10, 2025

కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

image

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.