News November 10, 2025
తిరుపతి: “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్ అంటే ఏంటి…?

మానవ, అడవి జంతువుల ఘర్షణ పెరుగుతున్న నేపథ్యంలో AP ప్రభుత్వం “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife అని అర్థం. ఈ ప్రాజెక్టు ద్వారా అడవి జంతువులతో జరిగే ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులను రక్షించడం ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News November 10, 2025
వరంగల్ ప్రాముఖ్యతను వివరించిన అందెశ్రీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పేరుగాంచిన పల్లెలను కీర్తిస్తూ అందెశ్రీ రచించిన ‘గలగల గలగల గజ్జెలబండి ఘల్లు చూడు.. ఓరుగల్లు చూడు’ అనే పాట ఆయన లేడని ఘోల్లుమంటోంది. ‘కాకతీయులు ఏలిన ఖిల్లా వరంగల్, వేయిస్తంభాల గుడి, పెంబర్తి హస్తకళలు, రజాకార్లను తరిమికొట్టిన మద్దూరు మండలంలోని వీరబైరాన్ పల్లినీ, జాతీయ విప్లవకారులనుగన్న జాగోరే జనగామను చూడు’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాముఖ్యతను ఈ పాటలో చాటి చెప్పారు.
News November 10, 2025
అందెశ్రీకి కోదాడతో విడదీయరాని బంధం

రచయిత అందెశ్రీ మృతి పట్ల కోదాడ ‘తెర’ సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కోదాడ, ‘తెర’తో అందెశ్రీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఇటీవల దశాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొని ఆట, పాటను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. “జై బోలో తెలంగాణ” పాట నిప్పులవాగై ప్రవహించిందని, “చూడ చక్కనితల్లి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” పాటలు సజీవమని కొనియాడారు.
News November 10, 2025
ప్రారంభమైన మార్కెట్.. తగ్గిన పత్తి ధర

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,800 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం గరిష్టంగా పత్తి ధర రూ. 6,950 పలకగా.. నేడు భారీగా పడిపోయింది. దీంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.


