News November 10, 2025
నర్సంపేట: క్లాత్ స్టోర్ దగ్ధం.. రూ.80 లక్షల నష్టం..!

నర్సంపేటలోని జయశ్రీ టాకీస్ సమీపంలో ఉన్న శివరామ క్లాత్ స్టోర్‌లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు షాపు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో షాపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, విలువైన దుస్తులు దగ్ధం కావడంతో సుమారు రూ.80 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు యజమాని రాజు తెలిపారు.
Similar News
News November 10, 2025
జూబ్లీ బైపోల్: BRS నాయకత్వానికి KCR కీలక ఆదేశాలు

జూబ్లీ బైపోల్‌కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా BRS అధ్యక్షుడు KCR ఈ రోజు సాయంత్రం KTR, హరీశ్ రావు, కొంతమంది ముఖ్యమైన BRS నాయకులతో సమావేశం కానున్నారు. రేపు పోల్ మేనేజ్మెంట్ కీలకమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓట్ల కోసం అధికారం, డబ్బును ఉపయోగించుకుంటుందని హెచ్చరించారు. పోలింగ్ స్థితిని పర్యవేక్షించడానికి కొన్ని ముఖ్యమైన పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక BRS బృందాలను మోహరించనున్నట్లు సమాచారం.
News November 10, 2025
వరంగల్ ప్రాముఖ్యతను వివరించిన అందెశ్రీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పేరుగాంచిన పల్లెలను కీర్తిస్తూ అందెశ్రీ రచించిన ‘గలగల గలగల గజ్జెలబండి ఘల్లు చూడు.. ఓరుగల్లు చూడు’ అనే పాట ఆయన లేడని ఘోల్లుమంటోంది. ‘కాకతీయులు ఏలిన ఖిల్లా వరంగల్, వేయిస్తంభాల గుడి, పెంబర్తి హస్తకళలు, రజాకార్లను తరిమికొట్టిన మద్దూరు మండలంలోని వీరబైరాన్ పల్లినీ, జాతీయ విప్లవకారులనుగన్న జాగోరే జనగామను చూడు’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాముఖ్యతను ఈ పాటలో చాటి చెప్పారు.
News November 10, 2025
అందెశ్రీకి కోదాడతో విడదీయరాని బంధం

రచయిత అందెశ్రీ మృతి పట్ల కోదాడ ‘తెర’ సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కోదాడ, ‘తెర’తో అందెశ్రీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఇటీవల దశాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొని ఆట, పాటను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. “జై బోలో తెలంగాణ” పాట నిప్పులవాగై ప్రవహించిందని, “చూడ చక్కనితల్లి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” పాటలు సజీవమని కొనియాడారు.


