News November 10, 2025

రాజన్న ఆలయం వద్ద అదనపు బందోబస్తు

image

వేములవాడ రాజన్న ఆలయం వద్ద పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం లోపలికి వెళ్ళేందుకు ప్రధాన ద్వారం మెట్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం నాడు చోటు చేసుకున్న తోపులాట దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఎస్ఐలు ఎల్లాగౌడ్, రాజు, ఆలయ ఎస్పీఎఫ్ ఏఎస్ఐ మహేందర్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 10, 2025

NEET PG ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

image

నీట్ పీజీ ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు ఈనెల 5తో ముగియగా తాజాగా MCC దాన్ని పొడిగించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చంది. సమాచారం కోసం వెబ్సైట్‌ను ఫాలో కావాలని సూచించింది. కాగా పరీక్ష పారదర్శకంగా ఉండడం లేదని, ఆన్సర్ కీ పబ్లిష్ చేయాలని ఇంతకు ముందు SCలో కేసు దాఖలైంది. కోచింగ్ సెంటర్లే ఇలా కేసులు వేయిస్తున్నాయని NBE వాదిస్తోంది. దీనిపై అఫిడవిట్ వేయాలని SC ఇటీవల ఆదేశించింది.

News November 10, 2025

CSK నుంచి జడేజా ఔట్?

image

రాజస్థాన్‌తో ట్రేడ్ డీల్‌లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. RR నుంచి సంజూను తీసుకునేందుకు చెన్నై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జడేజా ఇన్‌స్టా అకౌంట్ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ డీల్ తర్వాత ఫ్యాన్స్ వార్‌ను నివారించడానికి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారా? లేక టెక్నికల్ సమస్యనా అనేది తెలియరాలేదు.

News November 10, 2025

ప్రచారం కోసం పిటిషన్లా? కేఏ పాల్‌పై సుప్రీం ఆగ్రహం

image

ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పిల్స్ దాఖలు చేస్తున్నారని మండిపడింది. PPP అంశంపై ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.