News November 10, 2025
తిరుపతి: నాయకులకు దూరంగా పవన్ టూర్…?

రెండు రోజుల పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో dy.CM పవన్ కళ్యాణ్ టూర్ సాగింది. అయితే ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ దగ్గరకు రానీయలేదనే చర్చ సాగుతోంది. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో సైతం ప్రజా ప్రతినిధులు పాల్గొనలేదట. మామండూరు ఫారెస్ట్ విజిట్‌లో సైతం పవన్ మాత్రమే ఉన్నారు. ఇక రెడ్ శాండిల్ గోడౌన్‌ను పవన్ మాత్రమే సందర్శించారు. పలమనేరులో సైతం ఎమ్మెల్యేలతో అంటీ అంటనట్లు వ్యవహరించారనే వాదన వినిపిస్తోంది.
Similar News
News November 10, 2025
డ్రాగన్ ఫ్రూట్ సాగు.. అనువైన నేలలు, నాటే సమయం

డ్రాగన్ ప్రూట్ పంట ఏ నేలలోనైనా పండుతుంది. అయితే రాళ్ల భూమి, ఎర్ర భూములు ఎక్కువ అనుకూలం. పంటను బెడ్ పద్ధతిలో వేసుకుంటే మంచిది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పంటను నాటుకోవడం శ్రేయస్కరం. ఈ నెలల్లో కాయను కత్తిరించిన మొక్క నుంచి కొమ్మను మనం స్వయంగా చూసి తెచ్చుకొని నాటితే అది 6 నుంచి 9 నెలల్లో కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటే మొక్కలు బతికే అవకాశం ఎక్కువ.
News November 10, 2025
జూబ్లీ బైపోల్: తాయిలాలకు ‘NO’ చెప్పండి!

జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మరో 3 ఏళ్ల వరకు అవకాశం రాదు. తాయిలాలకు తలొగ్గకండి. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అసెంబ్లీకి పంపండి. మద్యం పంచిన వారికి కాదు.. మంచి చేసే సమర్థత ఉన్న వారికి ఓటేయండి. పైసలు పంపిణీ చేసిన వారికి కాకుండా.. పనులు చేసే సత్తా ఉన్న అభ్యర్థికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసే సత్తా ఉన్న అభ్యర్థిని గెలిపించండి. వజ్రాయుధం వంటి ఓటును వినియోగించుకోండి.
News November 10, 2025
సివిల్స్‌లో పెరగని మహిళల భాగస్వామ్యం

సివిల్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగడం లేదు. పురుషులతో పోలిస్తే వారు 40% కూడా పోటీలో ఉండడం లేదని UPSC నివేదిక పేర్కొంటోంది. ప్రిలిమ్స్‌లో 2010లో మొత్తం 2,80,901కి గాను ఫీమేల్ 65,738(23.40%) ఉన్నారు. అదే 2021లో 5,10,438 మందికి గాను 1,68,352(32.98%) స్త్రీలు రాశారు. వీరిలో మెయిన్స్‌కు 14.75% మాత్రమే అర్హత సాధించారు. సామాజిక, ఆర్థిక, భద్రతా సమస్యలు, కుటుంబ సహకారం లేమే ఇందుకు కారణాలని విశ్లేషించింది.


