News November 10, 2025
పటాన్‌చెరు: సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్య

సీఐటీయూ జిల్లా కోశాధికారిగా రాజయ్యను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మల్లేశం తెలిపారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కోశాధికారిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ

సైబర్ నేరగాళ్లకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్లకు మూల్య ఖాతాల రూపంలో సహకరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. వ్యాపార పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం జరిగిందన్నారు. విచారణ నిర్వహించగా క్రిప్టో కరెన్సీ రూపంలో ఆ డబ్బు విదేశీ నేరగాళ్లకు చేరిందన్నారు.
News November 10, 2025
రష్యా భయంతో రక్షణ వ్యయాన్ని పెంచుతున్న EU దేశాలు

రష్యా దాడి భయంతో యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. తాజాగా జర్మనీ $1.2Bతో ఎయిర్ బస్ నుంచి 20 మిలటరీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. 2027 నాటికి ఇవి అందనున్నాయి. ఇప్పటికే అది 62 H145M హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. కాగా సాయుధ దళాల అత్యవసర ఆధునీకరణ కోసం జర్మనీ ఈ ఏడాదిలో ప్రత్యేక నిధినీ ఏర్పాటు చేసింది. ఈ ఆర్డర్లతో అనేక ఆయుధ తయారీ సంస్థలు ప్రయోజనాలు పొందుతున్నాయి.
News November 10, 2025
జూబ్లీ బైపోల్: తాయిలాలకు ‘NO’ చెప్పండి!

జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మరో 3 ఏళ్ల వరకు అవకాశం రాదు. తాయిలాలకు తలొగ్గకండి. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అసెంబ్లీకి పంపండి. మద్యం పంచిన వారికి కాదు.. మంచి చేసే సమర్థత ఉన్న వారికి ఓటేయండి. పైసలు పంపిణీ చేసిన వారికి కాకుండా.. పనులు చేసే సత్తా ఉన్న అభ్యర్థికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసే సత్తా ఉన్న అభ్యర్థిని గెలిపించండి. వజ్రాయుధం వంటి ఓటును వినియోగించుకోండి.


