News November 10, 2025

జూబ్లీహిల్స్‌లో మీ ఓటు ఆదర్శం అవ్వాలి!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా.. రేపు మన వంతు అని గుర్తు పెట్టుకోండి. నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు నిన్నటితో ముగిశాయి. రేపు మన అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. 4,01,365 మంది ఓటర్లలో మనం ఒక భాగం అని మర్చిపోకండి. MLAను ఎన్నుకునే బాధ్యత మనపైనే ఉంది. జూబ్లీహిల్స్‌కు 3 సార్లు ఎన్నిక జరిగినా సగం మంది ఓటెయ్యలేదు. ఈ బైపోల్‌లో మీరు వేసే ఓటు ఇతరులకు ఆదర్శం కావాలి. అందరూ ఓటెయ్యాలి.!

Similar News

News November 10, 2025

అందుకే నెక్లెస్ ధరించా: అల్లు శిరీష్

image

నిశ్చితార్థ వేడుకలో తాను నెక్లెస్ ధరించడంపై వస్తోన్న మీమ్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీశ్ స్పందించారు. ‘దీనికే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో’ అంటూ వచ్చిన మీమ్‌కు కౌంటరిచ్చారు. ‘మన తెలుగు మీమర్లు చాలా ఫన్నీ. మన మహారాజులు & మొగలులు చోకర్లు(నెక్లెస్) ధరించేవారు. చోకర్లు మహిళలకే అనేది పాతకాలం. ఇది 2025.. మనం అలాంటి పరిమిత నమ్మకాల నుంచి బయటకు రావాలి’ అని ట్వీట్ చేశారు.

News November 10, 2025

కొత్తపేటకు రానున్న కేంద్ర బృందం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేంద్ర ప్రభుత్వ పంట నష్టాల అంచనా బృందం మంగళవారం పర్యటించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అధికారులతో కేంద్ర బృందం పర్యటనపై ఆయన సోమవారం చర్చించారు. మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాల పూర్తి వివరాలను, ఛాయాచిత్రాలతో సహా కేంద్ర బృందానికి తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News November 10, 2025

డెబిట్ కార్డు ఉంటే చాలు.. మరణిస్తే రూ.10లక్షలు

image

చాలా బ్యాంకులు డెబిట్ కార్డులపై ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా అందిస్తాయి. కార్డు రకాన్ని బట్టి కవరేజ్ ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. బ్యాంకును బట్టి రూల్స్ వేరుగా ఉన్నాయి. ఫీజును బట్టి కవరేజ్ ఉంది. కొన్ని బ్యాంకుల్లో ATM వాడితేనే అర్హులు. వ్యక్తి మరణిస్తే నామినీ బ్యాంకుకు వెళ్లి డెత్ సర్టిఫికెట్, FIR, పోస్ట్ మార్టం నివేదికతో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించండి.