News November 10, 2025
కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.
Similar News
News November 10, 2025
అందుకే నెక్లెస్ ధరించా: అల్లు శిరీష్

నిశ్చితార్థ వేడుకలో తాను నెక్లెస్ ధరించడంపై వస్తోన్న మీమ్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీశ్ స్పందించారు. ‘దీనికే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో’ అంటూ వచ్చిన మీమ్‌కు కౌంటరిచ్చారు. ‘మన తెలుగు మీమర్లు చాలా ఫన్నీ. మన మహారాజులు & మొగలులు చోకర్లు(నెక్లెస్) ధరించేవారు. చోకర్లు మహిళలకే అనేది పాతకాలం. ఇది 2025.. మనం అలాంటి పరిమిత నమ్మకాల నుంచి బయటకు రావాలి’ అని ట్వీట్ చేశారు.
News November 10, 2025
డెబిట్ కార్డు ఉంటే చాలు.. మరణిస్తే రూ.10లక్షలు

చాలా బ్యాంకులు డెబిట్ కార్డులపై ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా అందిస్తాయి. కార్డు రకాన్ని బట్టి కవరేజ్ ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. బ్యాంకును బట్టి రూల్స్ వేరుగా ఉన్నాయి. ఫీజును బట్టి కవరేజ్ ఉంది. కొన్ని బ్యాంకుల్లో ATM వాడితేనే అర్హులు. వ్యక్తి మరణిస్తే నామినీ బ్యాంకుకు వెళ్లి డెత్ సర్టిఫికెట్, FIR, పోస్ట్ మార్టం నివేదికతో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించండి.
News November 10, 2025
కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చిన UIDAI.. ఫీచర్స్ ఇవే

కొత్త ఆధార్ యాప్‌ను UIDAI తీసుకొచ్చింది. ఆధార్ వివరాలను ఫోన్‌లో స్టోర్ చేసుకునేందుకు, ఇతరులతో పంచుకునేందుకు రూపొందించినట్లు Xలో పేర్కొంది. ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్‌లోని ఎంపిక చేసిన వివరాలనే షేర్ చేసుకునే సదుపాయం ఇందులో ఉండటం విశేషం. మిగతా సమాచారం హైడ్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా ఉంది.


