News November 10, 2025
అందెశ్రీకి కోదాడతో విడదీయరాని బంధం

రచయిత అందెశ్రీ మృతి పట్ల కోదాడ ‘తెర’ సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కోదాడ, ‘తెర’తో అందెశ్రీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఇటీవల దశాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొని ఆట, పాటను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. “జై బోలో తెలంగాణ” పాట నిప్పులవాగై ప్రవహించిందని, “చూడ చక్కనితల్లి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” పాటలు సజీవమని కొనియాడారు.
Similar News
News November 10, 2025
గద్వాల: ప్రజావాణికి 61 ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 10, 2025
సంగారెడ్డి: టీచర్లను సర్దు బాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామని పేర్కొన్నారు.
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<


