News November 10, 2025

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీలో 38 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, Asst ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.V.SC, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీతో పాటు డాక్యుమెంట్స్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. టీచింగ్ స్కిల్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://buat.edu.in/

Similar News

News November 10, 2025

మీకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయా?

image

తాము టెలికాం శాఖ అధికారులమని చెప్పి సైబర్ నేరగాళ్లు సామాన్యులను మోసం చేస్తున్నారు. ‘మీ ఫోన్ నంబర్-ఆధార్ లింక్ కాలేదు. మేం చెప్పినట్లు చేయకపోతే మీ నంబర్ బ్లాక్ చేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. వివరాలు చెప్పగానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అయితే టెలికాం శాఖ అలాంటి కాల్స్ చేయదని, ఎవరూ భయపడొద్దని PIB Fact Check స్పష్టం చేసింది. cybercrime.gov.in లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది.

News November 10, 2025

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 10, 2025

52 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 52 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్) అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఈ నెల 24న రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in