News November 10, 2025
మధిరలో 23న కళాకారుల వన సమారాధన

ఖమ్మం కొత్తగూడెం జిల్లాల కళాకారుల కోసం ఈ నెల 23న వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో మధిర మండలం ఆత్కూరులోని అబ్బూరి రామకృష్ణ మామిడి తోటలో ఈ కార్యక్రమం జరగనుంది. 2014 నుంచి ప్రతి ఏటా ఈ వనభోజనాలను నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల కళాకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిషత్ అధ్యక్షులు కోరారు.
Similar News
News November 10, 2025
NGKL: ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

NGKL కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 51 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే అన్ని శాఖల అధికారులు వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
News November 10, 2025
410కి పైగా ఎంవోయూలపై సంతకాలు: విశాఖ ఎంపీ

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈనెల 12న బీచ్ రోడ్, 17న గాజువాకలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. ఈనెల 14,15 తేదీల్లో జరిగే CII సమ్మిట్‌లో 410కి పైగా MOUలు, రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు జరగబోతున్నాయన్నారు. YCP పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, పెట్టుబడులు రావడం వారికి ఇష్టం లేదన్నారు. విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ పీహెచ్డీ చేసిందని మండిపడ్డారు.
News November 10, 2025
జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!

జూబ్లీహిల్స్.. పేరుకే లగ్జరీ కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెరీ లేజీ. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా సగం మందే ఓట్లు వేస్తున్నారు. 2023లో 47.58%, 2018లో 47.2% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తున్నా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ ఉపఎన్నిక కీలకంగా మారడంతో ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


