News November 10, 2025

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? రైల్వే టికెట్ బుకింగ్స్ మొదలు!

image

వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు JAN 10, ఎల్లుండి JAN 11, గురువారం రోజున జనవరి 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండి IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు. SHARE IT

Similar News

News November 10, 2025

జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!

image

జూబ్లీహిల్స్.. పేరుకే లగ్జరీ కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెరీ లేజీ. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా సగం మందే ఓట్లు వేస్తున్నారు. 2023లో 47.58%, 2018లో 47.2% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తున్నా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ ఉపఎన్నిక కీలకంగా మారడంతో ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News November 10, 2025

‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

image

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.

News November 10, 2025

JIO యూజర్స్ BSNL నెట్‌వర్క్ వాడుకోవచ్చు!

image

జియో 28 డేస్ వ్యాలిడిటీతో రెండు కొత్త(రూ.196, రూ.396) రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటితో రీఛార్జ్ చేసుకుంటే మారుమూల ప్రాంతాల్లో జియో సిగ్నల్ లేనప్పుడు BSNL నెట్‌వర్క్ వాడుకోవచ్చు. వీటిని ఇంట్రా-సర్కిల్ రోమింగ్(ICR) ప్లాన్స్ అంటారు. ప్రస్తుతం ఇవి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అందుబాటులో ఉన్నాయి. రీఛార్జ్ చేశాక ఎప్పుడైతే BSNL నెట్‌వర్క్ ఫస్ట్ వాడతారో అప్పుడే ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.