News November 10, 2025
BHPL: ‘సమస్యల పరిష్కారంపై అవగాహన ఉండాలి’

గ్రామ స్థాయి పరిపాలనా విధానాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సివిల్ సర్వీసెస్ శిక్షణా అధికారులకు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీలో శిక్షణా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులపై ప్రత్యక్ష అనుభవం అవసరమని నొక్కి చెప్పారు.
Similar News
News November 10, 2025
మెదక్: స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ

స్టాండింగ్ కమిటీ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయంలో జరిగిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం తదితర కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రఘునందన్ రావు ఉన్నారు.
News November 10, 2025
సిరిసిల్ల: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం.లో సోమవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. తంగళ్లపల్లిలోని తన ఇంటి వద్ద మచ్చ జలంధర్(70) తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో అతడి శరీరం బాగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివారలు సేకరిస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
‘ప్రజావాణి’కి 339 దరఖాస్తులు: జిల్లా కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 339 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల్లో అత్యధికంగా కరీంనగర్ నగర పాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.


