News November 10, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు

KNR జిల్లా తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు “ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ” పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు NOV 12 వరకు పొడిగించినట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు NOV 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News November 10, 2025
మెదక్: స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ

స్టాండింగ్ కమిటీ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయంలో జరిగిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం తదితర కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రఘునందన్ రావు ఉన్నారు.
News November 10, 2025
సిరిసిల్ల: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం.లో సోమవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. తంగళ్లపల్లిలోని తన ఇంటి వద్ద మచ్చ జలంధర్(70) తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో అతడి శరీరం బాగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివారలు సేకరిస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
‘ప్రజావాణి’కి 339 దరఖాస్తులు: జిల్లా కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 339 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల్లో అత్యధికంగా కరీంనగర్ నగర పాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.


