News November 10, 2025
కరీంనగర్: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చికిత్స పొందుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. గత రాత్రి సుల్తానాబాద్‌లో గుర్తుతెలియని వాహనం ఢీ కొనగా.. 108 వాహనం ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియలేదని, ఎవరైనా గుర్తుపడితే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
Similar News
News November 10, 2025
హనుమకొండ: 624 మందికి ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి

హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన 794 మందికి గాను, 624 మంది అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ నెల 22 వరకు 33 జిల్లాల నుంచి అభ్యర్థులను అగ్నివీరులుగా ఎంపిక చేయనున్నారు.
News November 10, 2025
హనుమకొండ: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు తెలంగాణ జిల్లాల అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్టుల్లో పాల్గొంటారు. ర్యాలీ సాఫీగా సాగేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News November 10, 2025
NLG: ప్రజావాణికి 94 ఫిర్యాదులు

నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు అందాయి. అందులో జిల్లా అధికారులకు సంబంధించి 31 ఫిర్యాదులు, రెవిన్యూ శాఖకు సంబంధించి 63 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అన్నారు.


