News November 10, 2025

కొత్తపేటకు రానున్న కేంద్ర బృందం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేంద్ర ప్రభుత్వ పంట నష్టాల అంచనా బృందం మంగళవారం పర్యటించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అధికారులతో కేంద్ర బృందం పర్యటనపై ఆయన సోమవారం చర్చించారు. మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాల పూర్తి వివరాలను, ఛాయాచిత్రాలతో సహా కేంద్ర బృందానికి తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Similar News

News November 10, 2025

హనుమకొండ: 624 మందికి ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి

image

హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన 794 మందికి గాను, 624 మంది అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ నెల 22 వరకు 33 జిల్లాల నుంచి అభ్యర్థులను అగ్నివీరులుగా ఎంపిక చేయనున్నారు.

News November 10, 2025

హనుమకొండ: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం

image

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు తెలంగాణ జిల్లాల అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్టుల్లో పాల్గొంటారు. ర్యాలీ సాఫీగా సాగేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News November 10, 2025

NLG: ప్రజావాణికి 94 ఫిర్యాదులు

image

నల్గొండ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు అందాయి. అందులో జిల్లా అధికారులకు సంబంధించి 31 ఫిర్యాదులు, రెవిన్యూ శాఖకు సంబంధించి 63 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అన్నారు.