News November 10, 2025
సిద్దరామయ్యకు సమయమివ్వని హైకమాండ్?

కర్ణాటకలో CM మార్పు చర్చ ఇటీవల జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్యతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమతో సమావేశం అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఇవే ఆదేశాలు ఇతర నేతలకూ వర్తిస్తాయని, అపాయింట్‌మెంట్లు అడగొద్దని స్పష్టంచేసినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో పుస్తకావిష్కరణకు మాత్రమే సిద్దరామయ్య పరిమితం కానున్నట్లు పేర్కొన్నాయి.
Similar News
News November 10, 2025
PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణమిదే!

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారన్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘గైడ్‌లైన్స్ ప్రకారం 2019 FEB 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్లీ జాబితాలో చేర్చుతాం’ అని పేర్కొంది.
News November 10, 2025
క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.
News November 10, 2025
లైంగిక వేధింపులు ఎదురైతే..

బహిరంగ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే సదరు వ్యక్తిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. అంటే ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఐపీసీ 354(ఎ), 354(డి), BNS సెక్షన్ 79 కింద కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్ 354 కింద మహిళపై దాడికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్ 294 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలి.


