News November 10, 2025
ఏయూ: ఎంసీఏ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఏయూ పరిధిలోని మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి పరీక్షలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పరీక్షలు విభాగం అధికారులు తెలిపారు.
Similar News
News November 10, 2025
ఎంజీఎంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: శేషు

ఉత్తర తెలంగాణలో పేదలకు వైద్య సేవలు అందించే ఎంజీఎంలో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజావేదిక రాష్ట్ర ఛైర్మన్ తిరునహరి శేషు అన్నారు. సోమవారం ఎంజీఎం సూపరింటెండెంట్‌కి విజ్ఞప్తి చేశారు. ఎంజీఎం హాస్పిటల్‌పై కలెక్టర్, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి హాస్పటల్లో మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు చేపట్టాలని, పూర్తిస్థాయిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
News November 10, 2025
పోలీసు ప్రధాన కార్యాలయానికి 66 వినతులు: SP

పుట్టపర్తిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి సోమవారం 66 వినతులు అందినట్లు SP సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన లక్ష్యమన్నారు. ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, సైబర్ నేరాలు అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరం న్యాయం చేస్తామన్నారు.
News November 10, 2025
HYD: అందెశ్రీకి సీపీ సజ్జనర్ నివాళి

HYD లాలాపేటలోని GHMC ఆచార్య జయశంకర్ గ్రౌండ్‌లో ప్రముఖ కవి అందెశ్రీ భౌతికకాయానికి హైదరాబాద్ సీపీ సజ్జనర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తెలంగాణ రచయిత, గొప్ప ఉద్యమకారుడు, జయ జయహే తెలంగాణ గీతం రాసిన కవి మరణించడం బాధాకరమని అన్నారు.


