News November 10, 2025

జూబ్లీ బైపోల్: ఓటు వేయడానికి 12 ఆప్షన్లు!

image

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT

Similar News

News November 10, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. ఎన్ని పనులున్నా ఓటేసి వెళ్లండి..!

image

గుర్తుందా.. రేపు నవంబర్ 11.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక జరిగే రోజు.. మీకు ఎన్ని పనులున్నా.. మీరు ఎంత బిజీ ఉన్నా.. రేపు మాత్రం ఓటేసిన తరువాతే పనులు చూసుకోండి..”ముఖ్యమైన పనులున్నాయి.. వీలుకాదు.. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది” అని అనుకోకండి.. అందరూ ఇలా అనుకుంటే ఇక ఓట్లు ఎవరు వేస్తారు? పనులు అందరికీ ఉంటాయి.. అవసరమైతే వాయిదా వేసుకోండి.. ఓటు వేయండి.. ప్లీజ్‌.

News November 10, 2025

HYD: మెడికల్ అకాడమీని సందర్శించిన మాజీ మంత్రి

image

మాజీ మంత్రి జానారెడ్డి ఈరోజు అపోలో మెడికల్ అకాడమీని సందర్శించారు. విద్యార్థులను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశానికి మెడికల్ విద్యార్థులు అందిస్తోన్న సేవలను, డైరెక్టర్ పోసిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషిని ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మంచి వెసులుబాటు కల్పించారని కొనియాడారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.

News November 10, 2025

HYD: అందెశ్రీకి సీపీ సజ్జనర్ నివాళి

image

HYD లాలాపేటలోని GHMC ఆచార్య జయశంకర్ గ్రౌండ్‌లో ప్రముఖ కవి అందెశ్రీ భౌతికకాయానికి హైదరాబాద్ సీపీ సజ్జనర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తెలంగాణ రచయిత, గొప్ప ఉద్యమకారుడు, జయ జయహే తెలంగాణ గీతం రాసిన కవి మరణించడం బాధాకరమని అన్నారు.