News November 10, 2025
జూబ్లీ బైపోల్: ఓటు వేయడానికి 12 ఆప్షన్లు!

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT
Similar News
News November 10, 2025
నిజామాబాద్: ప్రజావాణిలో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజమాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో 16 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను అందించవచ్చని సూచించారు.
News November 10, 2025
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. ఎన్ని పనులున్నా ఓటేసి వెళ్లండి..!

గుర్తుందా.. రేపు నవంబర్ 11.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగే రోజు.. మీకు ఎన్ని పనులున్నా.. మీరు ఎంత బిజీ ఉన్నా.. రేపు మాత్రం ఓటేసిన తరువాతే పనులు చూసుకోండి..”ముఖ్యమైన పనులున్నాయి.. వీలుకాదు.. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది” అని అనుకోకండి.. అందరూ ఇలా అనుకుంటే ఇక ఓట్లు ఎవరు వేస్తారు? పనులు అందరికీ ఉంటాయి.. అవసరమైతే వాయిదా వేసుకోండి.. ఓటు వేయండి.. ప్లీజ్.


