News November 10, 2025

అనకాపల్లి పీజీఆర్ఎస్‌లో 239 అర్జీలు

image

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. అలాగే అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమస్యలు పరిష్కారం అవ్వకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. సమస్యలపై 239 అర్జీలను ప్రజలు సమర్పించారు.

Similar News

News November 10, 2025

ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

image

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.

News November 10, 2025

GNT: అనుచిత పోస్టులు.. హైదరాబాద్‌లో అరెస్ట్

image

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టిన తుపాకుల సతీష్ కుమార్‌ను పాత గుంటూరు పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి హైదరాబాద్‌లోని జీడిమెట్లలో అరెస్ట్ చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు.

News November 10, 2025

HNK: అగ్ని వీరుల ఎంపిక ప్రక్రియ విధానం ఇలా..!

image

అగ్ని వీరుల ఎంపిక కోసం ప్రతి బ్యాచ్‌లో 100 మంది అభ్యర్థులు పాల్గొని 1600 మీటర్ల (నాలుగు రౌండ్లు) దూరం పరిగెడతారు. ప్రదర్శన ఆధారంగా వర్గీకరణ: బ్యాచ్ 1: 5 నిమిషాల 30 సెకన్ల లోపు -60 మార్కులు, బ్యాచ్ 2: 5:31-5:45 నిమిషాలు-48 మార్కులు, బ్యాచ్ 3: 5:46-6:00 నిమిషాలు-36 మార్కులు, బ్యాచ్ 4: 6:01-6:15 నిమిషాలు-24 మార్కులు ఉంటాయి.