News November 10, 2025
సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలి: నిట్ డైరెక్టర్

సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలు చేయాలని నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి అన్నారు. సోమవారం ప్రపంచ సైన్స్ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని నిట్‌లో అక్సాసెబుల్ అనలిటికల్ టెక్నాలజీపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సును ప్రారంభించిన సుబుధి మాట్లాడుతూ.. నాణ్యమైన పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా ఇంజినీరింగ్ విద్యార్థులు నిరంతరం పయనించాలన్నారు. సామజిక బాధ్యతగా ఆవిష్కరణలు చేయాలన్నారు.
Similar News
News November 10, 2025
కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.
News November 10, 2025
చొప్పదండి: 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గంగాధర మండలం రంగరావుపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన భారీ రేషన్ బియ్యాన్ని సోమవారం విజిలెన్స్ & సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, బియ్యం నిల్వ చేసిన ఇల్లు ఎవరిది? వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
జూబ్లీహిల్స్ పిలుస్తోంది..!

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇక్కడి ప్రతి ఓటు ఎంతో కీలకం. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అయితే కాస్ట్‌లీ ఏరియా కాబట్టి అద్దె సంపాదించుకోవచ్చని కొందరు ఓటర్లు తమ సొంతిళ్లను కిరాయికి ఇచ్చి సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. కొందరు కొల్లూరులోని 2BHKలోనూ ఉంటున్నారు. వారందరినీ జూబ్లీహిల్స్ పిలుస్తోంది. ఓటేసి వెళ్లమని చెబుతోంది.


