News November 10, 2025
మెట్‌పల్లి: పెళ్లి చేయట్లేదని తండ్రిని చంపేశాడు..!

మెట్‌పల్లిలో <<18248546>>కన్నకొడుకు చేతిలో తండ్రి హతమైన<<>> విషయం తెలిసిందే. అయితే హత్యకుగల కారణం పెళ్లి అని SI కిరణ్ తెలిపారు. అన్వేష్ తనకు పెళ్లి చేయాలని తండ్రితో తరచూ గొడవపడేవాడు. ఎంతకీ సంబంధాలు కుదరకపోవడంతో కక్ష పెంచుకున్న కొడుకు తండ్రిపై దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని కుటుంబీకులు NZBలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఉదయం మరణించాడు. మృతుడి మరో సంతానం ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News November 10, 2025
పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రుల సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణతో పాటు పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. రైతులకు మద్దతు ధర అందేలా, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News November 10, 2025
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి: ఎస్పీ

ప్రజావాణి ఫిర్యాదులపై పోలీసు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 8 ఫిర్యాదులు వచ్చాయని.. అందులో భూతగాదాలు-04, పరస్పర గొడవలకు సంబంధించి-4 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు.
News November 10, 2025
నిర్మల్: రక్షణ కిట్లను అందజేసిన కలెక్టర్

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణీ, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.


