News November 10, 2025

HYD: అందెశ్రీకి సీపీ సజ్జనర్ నివాళి

image

HYD లాలాపేటలోని GHMC ఆచార్య జయశంకర్ గ్రౌండ్‌లో ప్రముఖ కవి అందెశ్రీ భౌతికకాయానికి హైదరాబాద్ సీపీ సజ్జనర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తెలంగాణ రచయిత, గొప్ప ఉద్యమకారుడు, జయ జయహే తెలంగాణ గీతం రాసిన కవి మరణించడం బాధాకరమని అన్నారు.

Similar News

News November 10, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. నచ్చకపోతే కనీసం నోటాకైనా వేయండి!

image

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకునే ప్రభుత్వమని చదువుకున్నాం.. ఇపుడు జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లేదు కానీ.. నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్కరు.. ఇద్దరు కాదు 58 మంది నాయకులు.. ‘‘మేము మీ సమస్యలు పరిష్కరిస్తాం’’ అంటూ నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే బరిలో నిలిచారు. వారిలో మీకు నచ్చిన వారిని ఎన్నుకోండి.. లేకపోతే కనీసం నోటాకు అన్న ఓటేయండి. ఇది మీ బాధ్యత.

News November 10, 2025

మీర్జాగూడ ఘటన.. టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

image

చేవెళ్ల పరిధి మీర్జాగూడ గేట్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన టిప్పర్ డ్రైవర్, నాందేడ్ జిల్లా వాసి ఆకాశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈరోజు చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.

News November 10, 2025

ఘట్‌కేసర్: అందెశ్రీ అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించనున్నందున ఘట్‌కేసర్‌లోని ఎంఎల్ఏ క్యాంపు ఆఫీస్ పక్కన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. అందెశ్రీ అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అన్నీ శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.