News November 10, 2025

SDPT: రైతులకు కలెక్టర్లు అండగా ఉండాలి: మంత్రి

image

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జిల్లా కలెక్టర్లు అండగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పనపై సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలసి ఆయా శాఖల ఉన్నత అధికారులతో కలిసి, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Similar News

News November 10, 2025

యాదాద్రి: 14న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం

image

ఈనెల 14న బాలల దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల ప్రగతిని ఈ సమావేశంలో ప్రదర్శించాలని, బాలల హక్కులను తల్లిదండ్రులకు వివరించాలని తెలిపారు. విద్యార్థులతో క్రీడలు, కథలు, చిత్రలేఖనం, డ్రామాలు ప్రసరింపజేయాలని తెలిపారు.

News November 10, 2025

బిక్కనూర్: గురుకుల కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

image

బిక్కనూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదివి, 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిషన్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

News November 10, 2025

INTERESTING: అరటిపండు తినలేనోడు.. విమానాన్ని తినేశాడు

image

ప్లేట్లు, పలు వస్తువులు తినే వాళ్లను సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి లక్షణాలున్న వ్యక్తి మిచెల్ లోటిటో. ఫ్రాన్స్‌లో 1950లో పుట్టారు. 9 ఏళ్ల వయసు నుంచే గాజు, ఇనుప పదార్థాలను తినడం మొదలుపెట్టారు. పికా అనే ప్రత్యేక వ్యవస్థతో లోటిటో బాడీ నిర్మితమైందని వైద్యులు తెలిపారు. ఆయన ఓ విమానాన్ని రెండేళ్లలో పూర్తిగా తినేశారు. సైకిల్స్, టీవీలు తినే లోటిటో 2006లో మరణించారు. అయితే ఆయన అరటిపండు తినలేకపోయేవారు.