News November 10, 2025

కామారెడ్డి: జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

image

జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులు, నష్టపరిహారం చెల్లింపులపై KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. NH–765D ప్రాజెక్టు కింద మెదక్ నుంచి ఎల్లారెడ్డి (ప్యాకేజ్-1) వరకు అవార్డులు పూర్తయ్యాయని తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ (ప్యాకేజ్-2) భూసేకరణను పూర్తి చేసి, రైతులకు నష్టపరిహారం త్వరగా అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 11, 2025

భద్రకాళి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

image

దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామివారికి అసంఖ్యాక రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.

News November 11, 2025

జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

image

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్‌కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.

News November 11, 2025

జగిత్యాలలో నేటి మార్కెట్ ధరలు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,201, కనిష్ఠ ధర రూ.1,600, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,961, కనిష్ఠ ధర రూ.1,810, వరి ధాన్యం(BPT) గరిష్ఠ ధర రూ.2,041, కనిష్ఠ ధర రూ.1,930, వరి ధాన్యం(HMT) ధర రూ.2,261, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,631, కనిష్ఠ ధర రూ.1,951గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.