News November 10, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన CP

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు, మహిళా కానిస్టేబుల్‌ను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. సాయి నగర్-2 నుంచి హోంగార్డ్ అల్లం భూమయ్య ఆయన కూమర్తె మహిళా కానిస్టేబుల్ అల్లం మాధురిని నిన్న రాత్రి బైక్‌పై విధులకు తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 11, 2025
NZB: ఢిల్లీలో పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.
News November 10, 2025
TU అధికారులు వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలి: AISF

TUలో 2012లో ఉద్యోగ నోటిఫికేషన్లో జరిగిన నియామకాలను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును TU అధికారులు వెంటనే అమలు చేయాలని AISF యూనివర్సిటీ కన్వీనర్ సంజీవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ టీయూ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ వెంటనే స్పందించాలన్నారు.
News November 10, 2025
NZB: 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లాలో ఇప్పటికే దాదాపు 50% మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.


