News November 10, 2025

సూర్యాపేట: ‘ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతుంది’

image

సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతుందని అదనపు కలెక్టర్ సీతారామారావు మంత్రులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా తదితర పంటల సేకరణ పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, పత్తి వచ్చే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

Similar News

News November 11, 2025

దేశంలో మహిళలే అసలైన మైనారిటీలు: SC

image

పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై SC కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తాజా డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు జయా ఠాకూర్ (CONG) దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్‌లు నాగరత్న, మహదేవన్‌ల బెంచి విచారించింది. ‘పౌరులందరికీ సమానత్వం ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. మహిళలు 48% ఉన్నా రాజకీయ సమానత్వంపై చర్చ నడుస్తోంది. అసలైన మైనారిటీలు వారే’ అని వ్యాఖ్యానించింది.

News November 11, 2025

పెద్దపల్లి: పత్తి గరిష్ఠ ధర రూ.6,762

image

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం పత్తికి గరిష్ఠంగా రూ.6,762(క్వింటాల్‌), కనిష్ఠంగా రూ.5,051, సగటు ధర రూ.6,762గా పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 475 మంది రైతులు మొత్తం 1647.90 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా, మార్కెట్‌ యార్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు సజావుగా సాగాయన్నారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

image

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.