News November 10, 2025
HYD: రేపు ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, HYD, RR, MDCL కలెక్టర్లకు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలిచ్చారు. ఘట్‌కేసర్‌లో జరగనున్న అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
Similar News
News November 11, 2025
పెద్దపల్లి: పత్తి గరిష్ఠ ధర రూ.6,762

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తికి గరిష్ఠంగా రూ.6,762(క్వింటాల్), కనిష్ఠంగా రూ.5,051, సగటు ధర రూ.6,762గా పలికినట్లు మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 475 మంది రైతులు మొత్తం 1647.90 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా, మార్కెట్ యార్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు సజావుగా సాగాయన్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News November 11, 2025
భద్రకాళి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామివారికి అసంఖ్యాక రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.


