News November 10, 2025
HYD: రేపు ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, HYD, RR, MDCL కలెక్టర్లకు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలిచ్చారు. ఘట్‌కేసర్‌లో జరగనున్న అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
Similar News
News November 11, 2025
HYD: బైక్‌లపై వచ్చి ఇంటింటా ‘ఓటు కవర్’ డెలివరీ!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేపు(మంగళవారం) బైపోల్ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల నిఘా ఉన్నప్పటికీ, బైక్‌లపై కొందరు పేపర్ బాయ్ తరహాలో బస్తీల్లోని ప్రతి ఇంటి వద్దకు వచ్చి, డబ్బు, గుర్తుతో ఉన్న ఎన్వలప్ కవర్లను విసిరేసి పోతున్నారు. ఓటు కోసం విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. నచ్చకపోతే కనీసం నోటాకైనా వేయండి!

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకునే ప్రభుత్వమని చదువుకున్నాం.. ఇపుడు జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లేదు కానీ.. నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్కరు.. ఇద్దరు కాదు 58 మంది నాయకులు.. ‘‘మేము మీ సమస్యలు పరిష్కరిస్తాం’’ అంటూ నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే బరిలో నిలిచారు. వారిలో మీకు నచ్చిన వారిని ఎన్నుకోండి.. లేకపోతే కనీసం నోటాకు అన్న ఓటేయండి. ఇది మీ బాధ్యత.
News November 10, 2025
మీర్జాగూడ ఘటన.. టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

చేవెళ్ల పరిధి మీర్జాగూడ గేట్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన టిప్పర్ డ్రైవర్, నాందేడ్ జిల్లా వాసి ఆకాశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈరోజు చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.


